బాపట్ల: ఆటో ద్విచక్రవాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

58చూసినవారు
బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం ప్రధాన సెంటర్లో ఆదివారం ద్విచక్ర వాహనం, టాటా ఏసీ ఆటో ఢీకొని ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాపట్ల నుంచి నిజాంపట్నం వెళ్తున్న టాటా ఏసీ అతివేగంతో వచ్చి ద్విచక్ర వాహనదారుడిని ఢీకొట్టడంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గాయపడ్డ వ్యక్తిని కర్లపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్