బాపట్ల జిల్లా కర్లపాలెం మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహాన్ని కర్లపాలెం ఎంపీడీవో శ్రీనివాసరావు బుధవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు హాస్టల్ నిర్వాహకులు వడ్డిస్తున్న భోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తపరిచారు. అలాగే హాస్టల్లోని మరుగుదొడ్లను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం వడ్డించాలని సిబ్బందికి సూచించారు.