వైయస్సార్ పార్టీ నాయకులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చిన్న పిల్లల్లా 11 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష హోదా అడగటం హాస్యాస్పదంగా ఉందని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ అన్నారు. శనివారం బాపట్ల తెదేపా కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రకారం ఆయనకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఇతర పార్టీ ప్రతిపక్ష హోదా ఇవ్వగలవా అని జగన్ ను సూటిగా ప్రశ్నించారు.