విద్యార్థులచే తీర ప్రాంతంలో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం

58చూసినవారు
విద్యార్థులచే తీర ప్రాంతంలో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం
అంతర్జాతీయ తీర ప్రాంత పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా శనివారం బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు సూర్యలంక తీర ప్రాంతంలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల ప్రోగ్రాం ఆఫీసర్ డి.నిరంజన్ మాట్లాడుతూ తీరం లో వ్యర్ధాలు పేరుకుపోయి సాగర గర్భంలో ప్లాస్టిక్ ఇతర వ్యర్ధాలు చేరి మత్స్య సంపద నశిస్తుందని పేర్కొన్నారు. సముద్ర జీవవైవిద్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్