చీరాల- విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ పై ఎంపీ డిమాండ్

72చూసినవారు
చీరాల- విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్  పై ఎంపీ డిమాండ్
దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ శుక్రవారం విజయవాడలో నిర్వహించిన ఎంపీల సమావేశానికి హాజరైన బాపట్ల పార్లమెంటు సభ్యుడు తెన్నేటి కృష్ణ ప్రసాద్ తన నియోజకవర్గ పరిధిలో రైల్వే చేపట్టాల్సిన పనులపై నివేదిక సమర్పించారు. బాపట్ల రైల్వేస్టేషన్లో వందే భారత్ రైలుకు స్టాప్ ఇవ్వాలన్నారు. కరోనా సమయంలో నిలిపివేసిన రైళ్లన్నిటిని పునరుద్ధరించాలన్నారు. చీరాల-విజయవాడ మధ్య బాపట్ల మీదుగా ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ను ప్రవేశపెట్టాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్