ధాన్యం సేకరణకు అధికారులు సంసిద్ధంగా ఉండాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి అన్నారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వీక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. రైతుల సంక్షేమం కొరకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందని పేర్కొన్నారు. రైతులకు న్యాయం జరిగే విధంగా అధికారులు పనిచేయాలన్నారు. నవంబర్ నుంచి ధాన్యం సేకరణ ప్రారంభించేందుకు సంసిద్ధంగా ఉండాలన్నారు. జిల్లాలో. 2. 17 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ ప్రారంభమైందన్నారు.