అక్టోబర్ 15 నుండి ఉచిత ఇసుక అందుబాటులోకి వస్తుందని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి ఆదివారం మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఆరులక్షల టన్నుల ఇసుకను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందనీ వినియోగదారులు ఆందోళన చందనవసరం లేదని ఆయన తెలిపారు. వచ్చే వర్షాకాలం వరకు ఇసుక కొరత అనేది ఉండదనీ వివరించారు. అక్రమంగా ఎవరైనా ఇసుక తరలిస్తే ఉపేక్షించేది లేదనీ హెచ్చరించారు. కార్యక్రమంలో డిఎస్పి పాల్గొన్నారు.