చీరాల: మధ్యాహ్న భోజనం నాణ్యతపై స్కూళ్లలో తనిఖీలు

65చూసినవారు
ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ సిహెచ్ విజయ్ ప్రతాపరెడ్డి విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మంచి ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులపై ఉందని పేర్కొన్నారు. గురువారం చీరాల నియోజకవర్గంలో పలు పాఠశాలలు, రేషన్ దుకాణాలు, అంగన్ వాడీ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. తనిఖీల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. కొన్ని పాఠశాలల హెచ్ఎంలను నియంత్రణలో ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్