వేటపాలెంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా దెబ్బతిన్న వరి, మినప పంట పొలాలను శుక్రవారం ఏవో కాశీ విశ్వనాథ్ పరిశీలించారు. రైతుల నుంచి ఆయన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పంట దెబ్బతిన్న కౌలు రైతులు పొలం పాసుపుస్తకం, సాగు ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డులను వ్యవసాయ శాఖ కార్యాలయంలో అందజేయాలని ఏవో కాశీ విశ్వనాధ్ సూచించారు. పంట పొలాలను పరిశీలించి నమోదు చేసుకోవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.