దాచేపల్లి: సరస్వతి పవర్ భూముల్లో అధికారుల సర్వే
సరస్వతి పవర్ సంస్థ భూముల వ్యవహారంపై డ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం కదిలింది. దాచేపల్లి, మాచవరం మండలాల్లో సరస్వతి పవర్ సంస్థకు చెందిన భూముల్లో అటవీశాఖ భూముల విస్తీర్ణం ఎంత ఉందో పేర్కొంటూ నివేదిక ఇవ్వాలని అటవీశాఖ అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఈ నేపథ్యంలో దాచేపల్లి డిఆర్ఓ ఆధ్వర్యంలో శనివారం అటవీశాఖ సిబ్బంది దాచేపల్లి, మాచవరం మండలాల్లో సర్వే నిర్వహిస్తున్నారు.