Oct 24, 2024, 16:10 IST/ధర్మపురి
ధర్మపురి
రోడ్డు విస్తరణ పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే
Oct 24, 2024, 16:10 IST
సుల్తానాబాద్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం నుండి గట్టేపల్లి చౌరస్తా వరకు రోడ్డు విస్తరణ పనులను గురువారం సాయంత్రం పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్మన్ గాజుల లక్ష్మి రాజమల్లు, కాంగ్రెస్ నాయకులు మినుపాల ప్రకాష్ రావు, సాయిరి మహేందర్ పాల్గొన్నారు.