గోవుల అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు

50చూసినవారు
గోవుల అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు
ఈ నెల 17న బక్రీదు పండుగను పురస్కరించుకుని గోవుల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీటీసీ షేక్ కరీమ్ హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం లారీ అసోసియేషన్ నేతలకు ఈ అంశంపై పలు సూచనలు చేశారు. గోవుల అక్రమ రవాణా చేపట్టిన వారిపై కేసులు నమోదు చేసి కోర్టు కు హాజరుపరుస్తామని తెలిపారు. వాహనాల్లో పశువులు తరలించే వారు ఏపీఎంవీ యాక్ట్ 253 రూల్ ప్రకారం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకుని తరలించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్