పేద ముస్లింల అభ్యున్నతి, అభివృద్ధి కోసం దాతలు విరాళంగా ఇచ్చిన వక్స్ ఆస్తులపై ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడం సరికాదని ఎమ్మెల్యే నసీర్ అహ్మర్ అన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్స్ సవరణ బిల్లు-2024ను అంజుమన్-ఎ-ఇస్లామియా గుంటూరు తరఫున తిరస్కరిస్తున్నామని బుధవారం నసీర్ స్పష్టం చేశారు. ఈ బిల్లుకు కేంద్ర స్థాయిలో ముగ్గురు నిపుణులచే కమిటీ వేయాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి సూచించారన్నారు.