వైసిపి విద్యార్ధి విభాగం రాష్ట్ర కార్యదర్శి కాటూరి విజయ్ ఆధ్వర్యంలో శనివారం సెమి క్రిస్మస్ సందర్భంగా గుంటూరు నగరంలోని బొంగరాలబీడు 5 వ లైన్ రాణి సౌండ్స్ వద్ద వృద్ధులకు చీరల పంపిణీ చేయటం జరిగింది. ఈ సందర్భంగా కాటూరి విజయ్ మాట్లాడుతూ పేదలకు సహాయం చేయడమే నిజమైన క్రిస్మస్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ చక్రవర్తి, మద్దు ప్రేమ జ్వోతి బాబు, నల్లపు రాకేష్, అంకాల్ రాజు తదితరులు పాల్గొన్నారు.