జిఎన్ఎం, బిఎస్పి నర్సింగ్ పూర్తి చేసిన వారికి జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు గుంటూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కొండా సంజీవరావు సోమవారం తెలిపారు. తమ సంస్థతో పాటూ ఓంకాప్, క్యూరా పర్సనల్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని చెప్పారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు https: //shorturl. at/XZIGr నమోదు చేసుకోవాలని సూచించారు.