గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్వీఎన్ కాలనీలో అదృశ్యమైన చిన్నారులు షేక్. రవూఫ్, షేక్. ఖాశీంఖాషీం సోమవారం విశాఖ ఆర్కే బీచ్ లో ప్రత్యక్షమయ్యారు. ఆ చిన్నారులను ఏఎస్ఐ గమనించి ఆరా తీశారు. ఈ క్రమంలో చిన్నారులు తాము గుంటూరు నుంచి వచ్చామని చెప్పారు. దీంతో ఆ చిన్నారులను విశాఖ 3వ పట్టణ పోలీస్ స్టేషన్ లో అప్పగించి గుంటూరు పట్టాభిపురం స్టేషన్ స్టేషన్ కు అందించారు.