విజయవాడ, గుంటూరు జాతీయ రహదారిలో కుండపోత వర్షాలతో గుంటూరులో ట్రాఫిక్ అంతరాయం ఆదివారం ఏర్పడింది. మూడు రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలు జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయని ప్రయాణికులు తెలిపారు. ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటామన్న అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా అప్రమత్తం చేసి భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.