భారతీయ హ్యుమన్ రైట్స్ కౌన్సిల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా దాసరపల్లి విక్టర్(గురవయ్య) ను నియమించినట్లు భారతీయ హ్యుమన్ రైట్స్ కౌన్సిల్ (బిహెచ్ర్ అర్ సీ) జాతీయ అధ్యక్షులు, పూర్ణ చంద్ర సాహు, రాష్ట్ర అధ్యక్షులు పుల్లెల నాగేశ్వర రావు, ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన భారతీయ హ్యుమన్ రైట్స్ కౌన్సిల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ విక్టర్ (గురవయ్య)మాట్లాడుతూ మానవ హక్కుల పరిరక్షణ కై కృషి చేస్తానని, తనమీద నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన, జాతీయ చైర్మన్, మరియు రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.