గుంటూరు: రేపటి నుంచి ఉచిత సిలిండర్ బుకింగ్స్: మంత్రి

56చూసినవారు
గుంటూరు జిల్లా వ్యాప్తంగా దీపం పథకం ద్వారా 7 లక్షల మంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం మనోహర్ మీడియాతో మాట్లాడారు. అర్హత కలిగిన ప్రతీ ఒక్కరూ 29వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఉచిత గ్యాస్ని బుక్ చేసుకోవచ్చని చెప్పారు. బుక్ అయిన తరువాత నగదు లబ్దిదారుల ఖాతాల్లో జమచేయడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్