సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్టు చేసి వారిపై ఒత్తిడి చేస్తూ చిత్రహింసలకు గురిచేస్తున్న విషయం చూస్తూ ఉన్నామని మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. ఆదివారం గుంటూరులోని ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టులకు ఏం జరిగినా వైసీపీ అండగా ఉంటుందన్నారు. అందరికీ అండగా జగన్ ఉన్నారని, తామంతా వచ్చి నిలబడతామని భరోసా కల్పించారు.