గుంటూరు జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రొగ్రెసివ్ రిడ్రెస్సల్ సిస్టమ్(పీజీఆర్ఎస్) కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలను అధికారులకు విన్నవించుకున్నారు. కలెక్టర్ నాగలక్ష్మి ప్రజల సమస్యలను విని ఆ సమస్యల పరిష్కరానికి భరోసా ఇచ్చారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదులపై అధికారులు అప్రమత్తంగా ఉంటూ సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.