ప్రజల మనోభావాలతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆటలాడారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి మండిపడ్డారు. ఆమె శనివారం గుంటూరులో మాట్లాడుతూ అధికారం ఉన్నప్పటి నుంచి తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వైసీపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. తిరుపతి లడ్డూ ప్రసాదమును అపవిత్రత చేసిన వారిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.