గురజాల డీఎస్పీగా జగదీష్ శుక్రవారం నియమితులయ్యారు. ఎన్నికల సమయంలో గురజాల సబ్ డివిజన్ పరిధిలో ట్రైనీ డీఎస్పీగా పనిచేశారు. గ్రూప్-1 సర్వీసులో ఎంపికై తొలి పోస్టింగ్ గురజాల డీఎస్పీగా వచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గురజాల డీఎస్పీగా ఎవరినీ నియమించలేదు. గురజాల సబ్ డివిజన్ పరిధిలో డిఎస్పి ఎవరు లేరంటూ కూటమి నేతలు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేయడంతో గురజాల డిఎస్పీగా జగదీష్ ను నియమించారు.