కారంపూడిలో దుర్గమ్మకు బోనాల సమర్పణ
కారంపూడి పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీ గనిగుంతల బజార్లో దాసరి సంఘం ఆధ్వర్యంలో శనివారం దసరా సందర్భంగా కనకదుర్గ అమ్మవారికి సంఘ పెద్దలు, కమిటీ సభ్యులు బోనాలు సమర్పించారు. ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం బోనాలతో సంబరాలు నిర్వహించారు. వేడుకలకు భక్తులు భారీగా తరలివచ్చారు. కార్యక్రమంలో సంఘ పెద్దలతో పాటు యూత్ సభ్యులు, మహిళా భక్తులు, పలువురు పాల్గొన్నారు.