ఈనెల 8న కారంపూడి మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ విజయోత్సవ ర్యాలీ జరుగుతుందని సోమవారం తెలిపారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిధిగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు సురేష్ మాదిగ పాల్గొంటారని ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు తాళ్లూరి జీవరత్నం మాదిగ అన్నారు. కారంపూడిలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఏంఆర్పిఎస్ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు కందుకూరి రమేష్ మాదిగ పాల్గొన్నారు.