నీటిపారుదల శాఖ ఏఈని ప్రశ్నించిన రైతులు
కర్లపాలెం మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన రైతులు శనివారం నీటిపారుదల శాఖ ఏఈని నిలదీశారు. గ్రామంలో రైతులు తమ పంట పొలాలలో ఇటీవల సాగు ద్వారా వరి విత్తనాలు నాటిన కూడా కాలువ నీళ్లు అందించకపోవడంతో నీటిపారుదల శాఖ ఏఈ శ్రీనివాసరావును రైతులు ప్రశ్నించారు. ఎవరో ఓ వ్యక్తి చెప్పితే నీరు అందించలేదని తెలపడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి కోసమో తమ పొలాలను పాడుచేయడం ఎంతవరకు మంచిదని నిలదీశారు.