కలెక్టర్ ఇచ్చిన డీకే పట్టాను ఆన్లైన్ చేసేందుకు డబ్బులు డిమాండ్ చేసిన వీఆర్వోపై చర్యలు తీసుకోవాలని దళిత బహుజన సంక్షేమ సేవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్ డిమాండ్ చేశారు. బుధవారం రెంటచింతల మండల పరిధిలోని బాధితురాలు రామావత్ మంగితో కలిసి డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. గిరిజన మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించిన చింతల తండా వీఆర్వో భాస్కర్ పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.