ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మాచర్ల పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి శుక్రవారం నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భాష ప్రయుక్త రాష్ట్ర ఏర్పాటు కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం ఎనలేనిదన్నారు. పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించారన్నారు. మహనీయున్ని స్మరించుకోవాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు.