మాచర్ల మండలం విజయపురిసౌత్ పర్యాటక శాఖ నుంచి శ్రీశైలానికి లాంచి విహార యాత్ర ట్రిప్పులను నిర్వహించడం లేదని టూరిజం డిపార్ట్మెంట్ ఇన్ఛార్జి మేనేజర్ వినయ్ తుల్లా శనివారం తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం శ్రీశైలానికి లాంచి టూర్ నిర్వహిస్తామన్నారు. ఈ సంవత్సరం ఏపీ పర్యాటక శాఖ ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు రానందున లాంచ్ టూర్ ను ప్రారంభించలేదన్నారు. ఉత్తర్వులు రాగానే ప్రారంభిస్తామన్నారు.