Apr 07, 2024, 16:04 IST/పెద్దపల్లి
పెద్దపల్లి
ఇఫ్తార్ విందులు సోదరభావం పెంపొందిస్తాయి: ఎమ్మెల్యే
Apr 07, 2024, 16:04 IST
ఇఫ్తార్ విందులు సోదరభావాన్ని పెంపొందిస్తాయని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. ఆదివారం సుల్తానాబాద్ లోని పద్మనాయక కళ్యాణ మండపంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇలాంటి ఇఫ్తార్ విందులు మత సామరస్సాన్ని చాటుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, పట్టణ కౌన్సిలర్స్, మైనారిటీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.