మెగాస్టార్ చిరంజీవి తల్లి కొణిదెల అంజనాదేవి అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. చికిత్స కోసం ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. తల్లికి అస్వస్థతకు గురవ్వడంతో ఇవాళ విజయవాడలో జరగాల్సిన కార్యక్రమాలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాయిదా వేసి హైదరాబాద్‌కు బయలుదేరినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, అంజనాదేవికి చిరంజీవి, నాగబాబు, పవన్‌తోపాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.