మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం 'జనవాణి' కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. బాధితుల ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకుని ప్రతిఒక్క అర్జీని నిశితంగా పరిశీలించారు. అర్జీలను సంబంధిత శాఖలకు పంపించి సమస్యను పరిష్కరిస్తానని మంత్రి భరోసా ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమకు ప్రధానమని అన్నారు.