బలం లేనప్పుడు పోటీ ఎందుకు పెట్టాలని వైసీపీ నేతలను మంత్రి నారా లోకేశ్ ప్రశ్నించారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓటింగ్‌కు రావాలా? వద్దా? అనే కన్ఫ్యూజన్లో వైసీపీ నేతలు ఎందుకు పడాలని నిలదీశారు. ఆనాడు టీడీపీ శ్రేణులు తప్పు చేయలేదు కాబట్టే.. అక్రమ కేసుల్ని ధైర్యంగా ఎదుర్కొంటూ పోరాటం చేశారన్నారు. వైసీపీ శ్రేణులు తప్పు చేసి అడ్డంగా దొరికారన్నారు.