ఎన్టీఆర్, కోడెల విగ్రహాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
ముప్పాళ్ళ మండలం తొండపి గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు, డాక్టర్ కోడెల శివప్రసాదరావు విగ్రహాలను ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో సీసీ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో జరిగిన అనీష్, సరల వివాహానికి హాజరై. నూతన వధూవరులను ఎమ్మెల్యే ఆశీర్వదించారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.