ముప్పాళ్ళ మండలం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదివారం మాచర్ల నరసింహారావు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. నరసరావుపేట నుండి సత్తెనపల్లి వస్తున్న ద్విచక్ర వాహనం ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. గాయ పడిన బాధితుడిని సత్తెనపల్లి ఏరియా ప్రభుత్వ వైద్య శాలకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.