తల్లిపాల ఆవశ్యకతపై మహిళలకు అవగాహన
ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు సందర్భంగా ముప్పాళ్ళ మండలం మాదల గ్రామంలో శనివారం తల్లిపాల ఆవశ్యకతపై మహిళలకు అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్ వైజర్ జయలక్ష్మి మాట్లాడుతూ బిడ్డ పుట్టిన వెంటనే గంటలోపు ముర్రుపాలు ఇవ్వాలన్నారు. తల్లిపాలు బిడ్డకు దేవుడు ఇచ్చిన వరమని తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం వలన తల్లికి బిడ్డకు ఆరోగ్యం చేకూరుతుందని తెలిపారు.