నరసరావుపేట పట్టణం బరంపేట చివర డ్రైనేజీ మురుగు నీరు రోడ్లపై ప్రవహిస్తూ ప్రజలకు తీవ్ర అసౌకర్యం ఏర్పడడంతో ప్రజల సౌకర్యార్థం ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ఘటనా స్థలాన్ని సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తక్షణమే మరమ్మతు పనులు నిర్వహించాలని సంబంధిత అధికారులకు, కార్మికులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు ఏర్పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు.