రీ సర్వే, ఎల్పీ నెంబర్లను రద్దు చేయాలి

74చూసినవారు
రీ సర్వే, ఎల్పీ నెంబర్లను రద్దు చేయాలి
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ తో పాటు రీసర్వే, ఎల్పీ నెంబర్లను సైతం రద్దు చేయాలని పిడిఎం రాష్ట్ర నాయకులు వై. వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో సోమవారం ప్రజా సంఘాల నాయకులు నరసరావుపేట జిల్లా కలెక్టర్ కి మెమోరాండం అందజేశారు. రీసర్వే పేరుతో రైతుల హక్కులను కాలరాస్తూ అనేక అక్రమాలకు పాల్పడుతున్న రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్