ఇంకొల్లులోని వెలుగు కార్యాలయం నందు సోమవారం ఏపిఎం అనురాధ అధ్యక్షతన ఉల్లాస్ అక్షరాస్యత పై వివో ఏ లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. డ్వాక్రా సంఘాలలో నిరక్షరాసులను అక్షరాస్యులు లుగా చేసేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. తమ పాఠశాల భవనాలను అక్షర కేంద్రాలుగా ఇస్తామని ఆయన చెప్పారు.