పర్చూరు మండలాభివృద్ధి అధికారి ఆఫీసులో సోమవారం కత్తిపోట్ల కలకలం రేపింది. ఆ ఆఫీసులో ఏపీవోగా పనిచేస్తున్న బుల్లయ్య, కంప్యూటర్ ఆపరేటర్ ఖాదర్లపై వారి సహోద్యోగి అయిన టెక్నికల్ అసిస్టెంట్ రాజేంద్రపాల్ మధ్యాహ్నం భోజన విరామ సమయంలో కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఈ దాడిలో గాయపడ్డ ఆ ఇద్దరిని సహోద్యోగులు పర్చూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ఫిర్యాదు అందుకున్న పర్చూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.