పర్చూరు నియోజకవర్గం లోని మండల కేంద్రమయిన కారంచేడు గ్రామం నుంచి ఆదిపూడి, నూతలపాడుల లోని తమ పొలాలకు వెళ్లడానికి రైతులు ప్రధానంగా ఉపయోగించే రహదారి గుంతల మయంగా మారింది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ సమస్యతో బాధపడుతున్నామని వాహనదారులు కూడా వాపోతున్నారు. వర్షాకాలంలో ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే మరింత ఇబ్బందిగా ఉంటుందని అంటున్నారు. టిడిపి కూటమి ప్రభుత్వమయినా ఈ రహదారిని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.