రేపు పెదకాకాని మండలంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
పెదకాకాని మండలంలో రేపు ఆదివారం నంబూరు, తక్కెళ్ళపాడు, ఉప్పలపాడు, ఆర్ సి పాలెం, వి. కె. పురం, గొళ్లమూడి, వెనిగండ్ల, లూర్దు గిరి ఇతర గ్రామాలలో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పెదకాకాని విద్యుత్ సబ్ స్టేషన్ అధికారులు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్తు లైన్లు మరమ్మత్తుల నేపథ్యంలో సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారుల సహకరించాలని వారు కోరారు.