గుంటూరు జిల్లా పెదకాకాని గ్రామంలో మంగళవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డి ఈ ఖాన్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్తు లైన్లు మరమ్మత్తుల నేపథ్యంలో పెదకాకాని లూదరిగిరి కాలనీ, ముస్లిం కాలనీ, కొత్తనగర్, పాత నగర్, హేమలత కాలనీతో పాటు వెనిగండ్ల గ్రామంలో ఉదయం 8: 30 నుండి మధ్యాహ్నం 12: 30 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు తెలిపారు వినియోగదారులు సహకరించాలన్నారు.