పెదకూరపాడు: భూ సమస్యలను పరిష్కరించాలి: ఎమ్మెల్యే

53చూసినవారు
పెదకూరపాడు: భూ సమస్యలను పరిష్కరించాలి: ఎమ్మెల్యే
ప్రజల నుంచి వస్తున్న సమస్యల్లో ఎక్కువగా రెవెన్యూకి సంబంధించినవే ఉన్నాయని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మంగళవారం అసెంబ్లీ దృష్టికి తెచ్చారు. ఈ సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వీటిని పరిష్కరించే విషయంలో ఎమ్మార్వోకు లాగిన్ ఇచ్చే అంశంపై పరిశీలించాలన్నారు. 22ఏ భూములు తమ నియోజకవర్గంలో 2వేల ఎకరాలకు వరకూ ఉన్నాయన్నారు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ లోనూ సవరణలపై దృష్టి సారించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్