ప్రేమ పేరుతో వేధింపులు.. బాలిక ఆత్మహత్య!
ప్రేమ పేరుతో వేధింపులు తట్టుకోలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జరిగింది. నీలాంబరం అనే యువకుడు ఓ బాలికను ప్రేమ పేరుతో వేధించేవాడు. దాంతో ఆ బాలిక విషయాన్ని తన తండ్రికి చెప్పింది. బాలిక తండ్రి నీలాంబరంను మందలించాడు. అయినప్పటికీ నీలాంబరం వేధింపులు ఎక్కువయ్యాయి. మనస్థాపానికి గురైన బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలిసి నీలాంబరం కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.