మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. 'ప్రస్తుత రాజకీయ పరిణామాల మీద, రాజకీయ నాయకుల మీద నా అభిప్రాయాన్ని ఆమోదయోగ్యమైన భాషలో వ్యక్తీకరించేందుకు ఇబ్బంది పడుతున్నాను. రాజకీయ నాయకులకు మేము ఓట్లు వేసేది వారు మాకు మౌలిక సదుపాయాలు కల్పించి, ఉద్యోగ అవకాశాలు కల్పించి, మెరుగైన విద్యను అందించి మేము ఎదిగేందుకు సహకరిస్తారని. ప్రజలుగా మేము ఇలాంటి వివాదాలను అంగీకరించలేము' అని పేర్కొన్నారు.