గుంటూరులో గుర్తుతెలియని మృతదేహం
పొన్నూరు పట్టణానికి చెందిన వంట మేస్త్రి తడికిమల్ల జయ వంట పనుల నిమిత్తం గుంటూరు పట్టణంలోని గాంధీ పార్క్ వద్ద ఉన్న వ్యక్తిని వంట పని నిమిత్తం పొన్నూరు తీసుకువచ్చింది. సదరు వ్యక్తి పనిచేస్తూ స్పృహ కోల్పోయి గత శనివారం చనిపోయాడు. మృతదేహం గుంటూరు జిజిహెచ్ మార్చరీలో ఉన్నది. ఆచూకీ తెలిసినవారు పొన్నూరు పట్టణ పోలీసు వారికి సమాచారం ఇవ్వవలసిందిగా వారు విజ్ఞప్తి చేస్తున్నారు.