SLBC టన్నెల్‌లో 34 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 2 మృతదేహాలు లభించాయి. మిగిలిన 6 మంది కోసం డ్రిల్లింగ్, బ్లాస్టింగ్‌తో ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. టన్నెల్ బోరింగ్ మెషిన్ (టీబీఎం) కత్తిరించిన భాగాలను తొలగిస్తూ, వాటర్ జెట్ ద్వారా బురదను తొలగిస్తున్నారు. అధికారులు ఏప్రిల్ 10 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు.