హెల్మెట్ పెట్టుకోలేదని రూ.10 లక్షల ఫైన్

70చూసినవారు
హెల్మెట్ పెట్టుకోలేదని రూ.10 లక్షల ఫైన్
అహ్మదాబాద్‌లోని శాంతిపుర ట్రాఫిక్ సర్కిల్ వద్ద అనిల్ హదియా అనే విద్యార్థి గతేడాది హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతూ పట్టుబడ్డాడు. అయితే అతనికి విధించాల్సిన జరిమానా రూ.500. కానీ టైపింగ్ లోపం వల్ల అది ఏకంగా రూ.10,00,500గా మారింది. బాధితుడు అనిల్ ఆర్‌టీఓలో తన బైక్ వివరాలు చెక్ చేయగా ఈ తప్పు తెలిసింది. కోర్టు సమన్లు రాగానే విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, ట్రాఫిక్ పోలీసులు తమ పొరపాటును సరిదిద్దుతామని తెలిపారు.

సంబంధిత పోస్ట్