TG: యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం వద్ద రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా, ఒక భారీ కంటైనర్‌ను వెనుక నుంచి ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో 16 మంది ప్రయాణీకులకు తీవ్రగాయాలు కాగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డవారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.